దేశంలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నీసర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత ఉండటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కిందిస్థాయి కోర్టులు, డిస్ట్రిక్ లెవల్ కోర్టుల్లోని న్యాయమూర్తులు పరీక్షల ద్వారా ఎంపిక అవుతున్నా.. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో మాత్రం కొలిజీయం సిఫారసులు, ప్రభుత్వాల అనుమతుల కారణంగా ఎంపిక ప్రక్రియలో ఆలస్యం అవుతుందని తెలిపారు. కొలిజీయం పంపిన లిస్టును ప్రభుత్వాలు ఒకే చేయడం లేదని, వాళ్లు ఒక లిస్టు పంపిస్తే ప్రభుత్వాలు…