అనగనగా ఒక రాజకీయ నాయకుడు. ఆయన పేరు ధర్మపురి శ్రీనివాస్. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారాయన. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేస్‌లో ఉన్నారు. అప్పట్లో అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా వెళ్ళి సోనియాగాంధీని కలవగలిగిన స్థాయి ఆయనది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయి బీఆర్‌ఎస్‌లో చేరినా... ఫైనల్‌గా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు డీఎస్. ఆయన ఇద్దరు కొడుకుల్లో... సంజయ్ కాంగ్రెస్‌లో, అర్వింద్ బీజేపీలో ఉన్నారు.