వెంకీ మామ మళ్ళీ అదే బాట పట్టాడు. ఇంతకు ముందే అభిమానులు వద్దంటే వద్దని వేడుకున్న పనినే మళ్ళీ చేస్తున్నాడు. మరోసారి అభిమానులకు నిరాశను కలిగిస్తూ తన నెక్స్ట్ మూవీని ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. దగ్గుబాటి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న “దృశ్యం 2” మూవీ విడుదల తేదీని తాజాగా టీజర్ తో పాటు రివీల్ చేశారు మేకర్స్. అందులో నవంబర్ 25న “దృశ్యం 2” దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ లో విడుదల కానుంది…
విక్టరీ వెంకటేష్ తాజా థ్రిల్లర్ డ్రామా చిత్రం “దృశ్యం 2”. ఆయన హిట్ చిత్రం ‘దృశ్యం’ సీక్వెల్, మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ కేసు గురించి అందరూ మాట్లాడుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న ఆ కుటుంబం మళ్లీ చీకటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. ఆ ఇష్యూ నుంచి బయటపడేందుకు వెంకీ మరో…