Mineral Water: నీరు మన జీవితానికి చాలా అవసరం. మంచి శుభ్రమైన తీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే.. కలుషితమైన నీటిలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.