ఛత్తీస్‌గఢ్ , తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (IED) బాంబులు ఒక్కసారిగా పేలడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు చెందిన 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వారు పెద్ద ఎత్తున సమావేశం అయ్యే అవకాశం ఉందని భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో…