నటప్రపూర్ణ డాక్టర్ యమ్.మోహన్ బాబు తనదైన అభినయంతో వందలాది చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ఆయన నటనావారసత్వాన్ని పునికి పుచ్చుకొని తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, కూతురు మంచు లక్ష్మి సైతం సాగుతున్నారు. ఇప్పటికే తనయులతో కలసి నటించి అలరించిన మోహన్ బాబు, తొలిసారి కూతురు లక్ష్మితో కలసి ‘అగ్నినక్షత్రం’లో నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’లో దుర్వాసునిగానూ తనదైన అభినయంతో అలరించనున్నారు మోహన్ బాబు. ఏప్రిల్ 14న ‘శాకుంతలం’…
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ తమిళ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమవుతోంది. ‘తాను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు…