సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’ అని రాసిన సి.నారాయణరెడ్డి నిజంగానే చలనశీలంగా బతికారు, కొన్నేళ్ల కిందట త్యాగరాయ గానసభ వేదికపై ఆ చరణాలు చెప్పి తన కవిత్వం ప్రవాహ గుణ ప్రధానమని వర్ణిస్తే నన్ను మెచ్చుకున్న సినారె సభలో పాల్గనని రోజు వుండేది కాదు. ఇంత సభా సంచారంలోనూ…