Telangana: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వాటా కింద రూ. 4872 కోట్ల నిధులకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే అనేక ప్రతిపాదనలను రెడీ చేస్తోంది.