Trump: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి దీపావళి జరుపుకొన్నారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడాను. ఇద్దరం అద్భుతమైన సంభాషణ జరిపాం. వాణిజ్యం, అనేక విషయాలను చర్చించాం. ముఖ్యంగా వ్యాపార ప్రపంచం గురించి చర్చించుకున్నాం. ప్రపంచ వాణిజ్యంపై మోడీకి చాలా ఆసక్తి ఉంది.…