కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమయం సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ, జేడీఎస్‌లు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.