Pakistan: పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ నుంచి మేథోపరమైన వలసలు(టాలెంట్ ఎక్సోడస్)ను ఎదుర్కొంటోంది. దేశంలోని ప్రతిభావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు విదేశాలకు వెళ్తున్నారు. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది. అయితే, ఈ పరిస్థితిపై పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన ‘‘బ్రెయిన్ గెయిన్’’ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.…