రొమాంటిక్ మూవీ ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ సిద్ధూకి హీరోయిన్ పుట్టుమచ్చల గురించిన ప్రశ్నను సంధించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సిద్ధు ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు లేదా తన అభిప్రాయాన్ని పంచుకోలేదు. ఈ రోజు తన ట్విట్టర్ లో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి స్పందించాడు. ప్రతి ఒక్కరూ…
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన చివరి రెండు సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా విడుదల చేశాడు. కానీ ఆ రెండు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కడంతో ఈ కుర్ర హీరో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధు “డీజే టిల్లు” అనే రొమాంటిక్ ఎంటటైనర్ తో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. “డీజే టిల్లు” సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు…
సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ ఎంటటైనర్ “డిజె టిల్లు”. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి సిద్ధు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్ కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి రేసులో సినిమా ఉంటుందని ముందుగా ప్రకటించిన చిత్రబృందం ఆ తరువాత మనసు మార్చుకుంది. దీంతో ‘డీజే టిల్లు’ ఈ సంక్రాంతి…
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలన్నీ సందడి చేయడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’ జనవరి 14న, అశోక్ గల్లా ‘హీరో’ మూవీ జనవరి 15న, డిసెంబర్ 31న విడుదల కావాల్సిన రానా ‘1945’ చిత్రాన్ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలోనే నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’ రాబోతోంది. మరి కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం…