Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి…