Duvvada Srinivas: దువ్వాడ వాణి రోజుకో రకంగా మాటాడుతున్నారు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలను ఇంటిపైకి పంపించారు.. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారు.. ఆస్తులపై మాట్లాడారు.. తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా.. ఒకవైపు పెద్దమనుషులను పంపిస్తూ..
రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగిఉన్న కారును మాధురి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలు కాగా.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. చాలా సేపు బలవంతం చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు.
Divvala Madhuri: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ కుటుంబ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడకండి.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అని చెప్పుకొచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్‌లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం…