Tirupati: తిరుపతిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో పనుల జాప్యంపై వరుసగా ఫిర్యాదులు అందడంతో, కలెక్టర్ స్వయంగా అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా క్రయ- విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్లలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు.