కరోనా కల్లోలం సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా మందు.. ఎంతో మందికి నయం చేసిందని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్రభుత్వం.. ఓవైపు దీనిపై అధ్యయనం జరుగుతుండగా.. మరోవైపు.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమతించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది…