చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను…