మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సంగీతం ఏ లెవెల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలు, పాటల దాకా ప్రత్యేక దృష్టిపెడుతారు. అంతేకాదు, సంగీత దర్శకులతోను మంచి వాతావరణం ఏర్పరచుకొని.. తనకు కావాల్సిన ట్యూన్స్ వచ్చే దాకా కథను పూర్తిగా వారి మదిలో నింపేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలో సంగీతం అంత స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దాదాపు 11 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ.. జులైలో పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారట. కాగా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుందని సమాచారం. మరోవైపు మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా…