‘నల్లమల’ చిత్రాన్ని అందించిన దర్శకుడు రవిచరణ్ తన తదుపరి ‘నగారా’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆర్ఎమ్ నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. నమో క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించబోతున్న ఈ సినిమా వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటుందని పోస్టర్ చూడగానే ఇట్టే అర్థం అవుతుంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.