‘రాజా వారు-రాణీగారు’, ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల ‘మత్తు వదలరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ),…