Director Hari:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హరి తండ్రి విఏ గోపాలకృష్ణన్ నేడు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు.