ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వార్తాపత్రికలను డెలివరీ చేయడాన్ని పాకిస్తాన్ నిషేధించింది. దీనిని పాకిస్తాన్ సంకుచిత మనస్తత్వం కలిగిన చర్యగా, వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి? దాని కింద ఏ హక్కులు ఇవ్వబడ్డాయి? ఆ వివరాలు మీకోసం.. స్వతంత్ర, సార్వభౌమ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించి 1961లో వియన్నా సమావేశం మొదటిసారి జరిగింది. దీని కింద, దౌత్యవేత్తలకు ప్రత్యేక హక్కులు కల్పించే అంతర్జాతీయ ఒప్పందానికి నిబంధన విధించారు.…