India vs Pakistan: నేడు (డిసెంబర్ 21 ఆదివారం) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఇందులో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలోనే భారత్ పాకిస్థాన్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ ఎనిమిది వికెట్ల…