ఢిల్లీకే పరిమితం కాకుండా.. క్రమంగా రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పటికే పంజాబ్‌లో జెండా ఎగరవేసింది.. ఇప్పుడు గుజరాత్‌లో గెలుపే లక్ష్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో వరుసగా సమావేశం అవుతున్నారు. విద్యావంతులు, ఆటోడ్రైవర్లు, కర్షకులతో… ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే… మరోవైపు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో భేటీ అయ్యారు. Read Also: Smriti…
ఢిల్లీ ముఖ్యమంత్రి… అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం పదవిలో ఉన్నప్పటికీ ఆయన మామూలు వ్యక్తిగానే వ్యవహరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన ఓ సాధారణ ఆటోడ్రైవర్ ఇంట్లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఆయన లూధియానాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దిలీప్ తివారి అనే ఆటో డ్రైవర్.. సీఎం గారు మీరు చాలా మంది ఆటోడ్రైవర్లకు సాయం చేశారు… ఈ పేద ఆటోడ్రైవర్ ఇంటికి భోజనం చేయడానికి రాగలరా అంటూ ఆహ్వానించాడు.…