యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ లకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్…