తెలంగాణలో భూ సంస్కరణల కోసం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పురోగతిపై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్. ధరణి పోర్టల్ అమలులో సాధించిన పురోగతిని సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్ పలు సూచనలు చేశారు. ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై జిల్లా కలెక్టర్లు , ఇతర ఉన్నతాధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ధరణి పోర్టల్ ను ఇతర రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.…