ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యాన్ని సాధించింది. టాస్ గెలవడం భారత్‌కు కీలకంగా మారింది. భారత పేసర్లు అక్కడి వాతావరణాన్ని, పిచ్‌ను అద్భుతంగా వినియోగించుకున్నారు. పవర్ ప్లేలోనే కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ, సౌతాఫ్రికా టాపార్డర్‌ను పూర్తిగా కూల్చేశారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడైన లైన్స్, లెంగ్త్స్‌తో బౌలింగ్ చేసి, మొదటి…