రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి – భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి – భద్రతలులేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. దిశా చట్టం లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తితో తాము జరుగుతున్న ఘటనలపై విచారణ…