ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది… దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో…