నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్…