మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణానికి రాజకీయ, సినీ, సామాజిక రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రోశయ్య పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. రోశయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి సమీపంలో శామీర్ పేట్ మండలంలోని దేవరయాంజల్ గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన…