NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.