ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ పేలవమైన ప్రదర్శన కారణంగా తరచూ ట్రోల్ అవుతుంటాడు. కానీ రియాన్ దేవధర్ ట్రోఫీలో తనపై వచ్చిన ట్రోల్స్కు తగిన సమాధానం ఇచ్చాడు. రియాన్ దేవధర్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతూ.. 5 రోజుల్లో రెండు సెంచరీలు సాధించాడు. మంగళవారం వెస్ట్ జోన్‌పై రియాన్ 68 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇది అతనికి రెండో సెంచరీ. అంతకుముందు జూలై 28న…