ఏపీ ప్రభుత్వం నేడు ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్’ అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రిలు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు హజరయ్యారు. వీరితో పాటు డీఆర్‌డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిపై చర్చించినట్లు తెలిపారు.…