డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించి.. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత మీది అని తెలిపారు. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను.. పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను.. అలాగే, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (PADA)ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.