ఈరోజు (శనివారం) ఉప ముఖ్య కార్య నిర్వాహణాధికారి పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కలెక్టర్ మహబూబాబాద్, గౌరవ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మహబూబాబాద్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పలువురు ప్రముఖులు హాజరయ్యారు.