No Smoking: కర్నాటక ప్రభుత్వం తమ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం లేదా పొగాకు ఉత్పత్తులను సేవించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (DPAR) జారీ చేసిన సర్క్యులర్‌లో ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చట్టబద్ధమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా కార్యాలయ ఆవరణలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డును…