కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫాం హౌస్ ను పావుగా వాడుకోవడం.. నాకు తీవ్ర మనోవేదన కలిగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. మా ఫాం హౌస్ లో ఏ కట్టడమూ ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్ పరిధిలో లేవు.. ఏ కట్టడమైనా ఒక్క అంగుళం మేరకు ఉన్నా.. నా సొంత ఖర్చులతో కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.