దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా రంజీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ బరిలోకి దిగగా.. నేడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్‌లు రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున విరాట్ బరిలో దిగుతున్నాడు.…