ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సర్కారుకు లోఫ్లోర్ బస్సుల వ్యవహారం రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. ఆ పార్టీ నేతలు అతిషి, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు నోటీసులు పంపారు.