Minister Payyavula Keshav: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి పయ్యావుల కేశవ్.. మరి ఢిల్లీ, కాశీ, కోల్‌కతా, లండన్ ఎక్కడున్నాయి జగన్..? అంటూ ప్రశ్నించిన ఆయన, ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలు, రాజధానులు నదుల ఒడ్డునే ఉన్నాయని గుర్తుచేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పయ్యావుల.. నాగరికత మొదలైంది నదుల పక్కనే. మనిషి జీవన వికాసం, సంస్కృతి, వాణిజ్యం,…