మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రైతులకు మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకగా జరుగుతున్న…