టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది.