Home
Defence Cooperation
Defence Cooperation News
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇరువురు నేతలు వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతపై చర్చించారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత్ – అమెరికా ద్వైపాక్షిక సహాకరంలోని పలు అంశాలను సమీక్షించినట్లు మోడీ వెల్లడించారు. ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం పరస్పర సంప్రదింపులు, సన్నిహిత సమన్వయం కొనసాగించడంపై పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నట్లు… -
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
India-Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య రక్షణ, సముద్ర భద్రతా సహకారం మరింత బలోపేతమవుతోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ భద్రత, సముద్ర భాగస్వామ్యం, రక్షణ సహకారంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా భారత్ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎలాంటి కార్యకలాపాలకు ఉపయోగించనివ్వబోమని దిసానాయకే స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రంలో… -
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
USA: సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్‌లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ భారత్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక ‘‘శక్తివంతమైన దేశం’’ అని, భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని అన్నారు. ఇదే సమయంలో గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేసినట్లు చెప్పారు. అయితే, పలు సందర్బాల్లో సిందూర్ ఆపే విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదని, పాక్… -
India-UK: ఇది కదా భారత్ సత్తా.. బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు IAF శిక్షణ..
India-UK: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే పలు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ పాకిస్తాన్‌పై భారత్ జరిపిన దాడిని పాఠ్యాంశంగా చేర్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ వైమానిక దళం(IAF), యునైటెడ్ కింగ్డమ్(UK) ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వనుంది. భారత్-యూకే మధ్య సైనిక శిక్షణా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి. -
Putin In India: ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్.. స్వయంగా స్వాగతించిన మోడీ..
Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. పుతిన్‌ను స్వాగతించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ, ఎయిర్ పోర్టుకు వచ్చారు. పుతిన్‌ను మోడీ ఘనంగా స్వాగతించారు. -
Putin In India: మోడీతో డిన్నర్, రాష్ట్రపతితో సమావేశం.. పుతిన్ పూర్తి షెడ్యూల్ ఇదే..
Putin In India: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రెండు రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతించారు. పుతిన్ 23వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ పూర్తి షెడ్యూల్: మొదటి రోజు: * సాయంత్రం 6.35: వ్లాదిమిర్ పుతిన్ పాలం… -
Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. పుతిన్ పర్యటనపై రష్యా, భారత్ రెండు దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. -
Sergio Gor: మోడీతో భేటీ అయిన అమెరికా రాయబారి సెర్గియో గోర్..
Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు. -
Bangladesh: భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..
Bangladesh: భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!