USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
- భారత్ శక్తివంతమైన దేశం,సైన్యాన్ని వేగంగా ఆధునీకరిస్తోంది.
- హిందూ మహాసముద్రంలో శక్తి సమతుల్యతకు భారత్ కీలకం
- భారత్‌తో కలిసి ఆయుధాల తయారీకి సిద్ధమన్న అమెరికా.
- అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్‌లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ భారత్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక ‘‘శక్తివంతమైన దేశం’’ అని, భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని అన్నారు. ఇదే సమయంలో గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేసినట్లు చెప్పారు. అయితే, పలు సందర్బాల్లో సిందూర్ ఆపే విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదని, పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే నిలిపేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతీ ఏడాది సింగపూర్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ఉన్నత సైనికాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో 44 దేశాలు పాల్గొన్నాయి. శనివారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రసంగిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని చెప్పడంతో పాటు, హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్‌ను కాపాడటంలో సహాయపడుతుందని తెలిపారు. భారతదేశం తన భారీ, ముఖ్యమైన సైనిక అవసరాలను తీర్చడానికి సొంత కర్మాగారాలను, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటోందని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో కలిసి సంయుక్తంగా ఆయుధాలు, సైనిక సామగ్రిని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియా ముఖ్యమైన ప్రాంతమని, ఈ ప్రాంతంపై ఒక్క దేశం ఆధిపత్యం చెలాయించడాన్ని కోరుకోవడం లేదని చైనాను గుర్తించి ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?