తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉండకూడదని పేర్కొంది. ఈ అంశంపై మూడు నెలల్లో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.