భారతీయ చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడు, అన్నలకు తగ్గ తమ్ముడు అనిపించుకున్న నటుడు ఎవరు అంటే శశి కపూర్ పేరు ముందుగా వినిపిస్తుంది. మూకీల నుండి టాకీల ఆరంభం దాకా తనదైన బాణీ పలికించిన మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ చిన్నకొడుకు శశి కపూర్. ఆయన అన్నలు రాజ్ కపూర్, షమ్మీ కపూర్ సైతం హిందీ చిత్రసీమలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ రొమాంటిక్ హీరోస్ గా జయకేతనం ఎగురవేశారు. వారి బాటలోనే పయనిస్తూ శశి…