సీరియల్ రికార్డ్ బ్రేకర్‌గా పేరుగాంచిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ చరిత్ర తిరగరాశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రోజు 15 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్.. ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒక్కరోజులోనే 15 రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించేందుకు ఓ వ్యక్తి గొప్ప సాహసమే చేశాడు. ఇంతకీ ఏం చేశారనుకుంటున్నారా?. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్ అనే వ్యక్తి 150 వెలిగించిన కొవ్వొత్తులను 30 సెకన్ల పాటు నోటిలో పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు.