ఓ వ్యక్తి ప్రవహించే వరదలో కారు నడుపుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కొండ ప్రాంతం.. అక్కడ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వీడియోలో వరదలో నుంచి ఎలా వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ప్రవహిస్తున్న నదిని లెక్కచేయకుండా వాహనాన్ని ముందుకు పోనిస్తున్నాడు. చిన్న పొరపాటు జరిగినా తన పరిస్థితి ఏమవుతుందో అని అస్సలు భయపడడు.