రష్యా ఆటగాడు, ప్రపంచ 13వ ర్యాంకర్ డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా పడింది. యూఎస్ ఓపెన్ 2025లోని తొలి రౌండ్‌లోనే ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదెవ్ తన రాకెట్‌ను కోర్టులోనే విరగ్గొట్టాడు. అంతకుముందు ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. ఈ రెండు సంఘటనల కారణంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులు అతడికి 42,500 యూస్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు) జరిమానాను విధించారు. తొలి రౌండ్‌లో ఆడినందుకు వచ్చే 110000 డాలర్ల ప్రైజ్‌మనీలో ఈ జరిమానా మూడో వంతుకు…